గుర్తుకొస్తున్నాయి.





ఓరెయ్ బంగారు,
ఇక్కడ నువ్వు ఉండి ఉంటే అనే ఆలొచనే చాలు నా మనసు శరీరం పులకించిపోవడానికి, నువ్వుంటే ఇలాఉండును నువ్వుంటే ఆలా ఉండును, నువ్వు ఇలా అనేదానివి ఆమాటలు నేను మైమరచివినేవాడిని, ఈ వెన్నల రాత్రీలో నువ్వు నాపక్కన మెరుస్తూ ఉండేదానివి, ఆ మెరుపు కాంతి నా కళ్ళనిండా నిండి కొత్త ప్రపంచన్ని చూస్తూ ఉందును.
నువ్వు నాజీవితంలోకి రాకముందు నా జీవితం ఇలా ఉండేది కాదు తెలుసా? తలదువ్వుకునేటప్పుడు బూట్లు వేసుకొవాలా చెప్పులు వేసుకోవాలా అని ఆలొచించేవాడిని.షర్టు బటన్స్ పెట్టుకునేటఫ్ఫుడు బైకులో పెట్రోల్ ఉందో లేదోనని ఆలోచించేవాడిని. అన్నంలో మజ్జిగ పోసుకునేటప్పుడు ఎక్కడో కర్చిప్ వదిలివేసిన విషయం గుర్తుకువచ్చేవి. కాని ఇప్పుడలా కాదురా... నాన్నా తిడుతున్నా కీరవాణి పాటాలా అనిపిస్తుంది, accounts లో టోటల్ మిస్ అవుతుంటే నీకుపెట్టకుండా వదిలేసిన నా ముద్దులు గుర్తుకొస్తున్నాయి, అద్దం ముందు నిల్చుని తలదువ్వుకుంటుంటే వెనకనుంచి వచ్చి నా క్రాప్ చెరిపినట్టు అనిపిస్తుంది ఎమైందిరా నీకు అని అమ్మ అడిగితే అమ్మా నాకుమెరిసే నక్షత్రం దొరికింది అని అరచి చెప్పాలనిపిస్తుంది.
అమ్మాయిల ప్రపంచం విచిత్రం కదా? మీకు ఏమి కావాలో అనేది తేలుసుకొవడనికే సగం జీవితం గడిచిపోతుంది. అయినా మీకేమి కావాలో అవి అన్నీ కంటిచివర చూపులతోనే చూపించి తప్పకుండా మానుండి చేపించుకుంటారు కదా! ఎంత తెలివైన వారో మీరు! ప్రేమించే అబ్బాయిలు ఎప్పడు డెటాల్ లాంటి సబ్బులు వాడకూడదు ఎమున్నా mysore sandel లాంటి soap బాగుంటుంది అని నీ నుంచి వచ్చిన మాటకు రూమునిండా sandel soaps తో నింపేసాను తెలుసా? ఎదురుగా కూర్చుని బొగ్గు ఇంజన్ రైలులాగా సిగరెట్ కాల్చి పొగవదలడం ఇష్తం లేదన్నావే, ఇకముందు ఒట్టు సిగరెట్ ముట్టను అని చెప్పి అక్కడ ఎక్కడో దొంగచాటుగా సిగరెట్ కాల్చి క్రేన్ ఒక్కపొడి తిని నీకు ముద్దు పెడుతానికి వచ్చి దొరికిపొతాను చూడు! అది ఇష్టం అని చూచించింది నువ్వే.
సాదారణంగా అబ్బాయిలు కలలోకి తన ప్రేయసి రావాలని ఆశించి నిదురపొ్తారు. కలకై ఎదురు చూస్తారు, అయితే నేను అలా కాదురా పిచ్చి, కలలోకి వచ్చిన నువ్వు దారి తెలవక కనీసం అడగకుండా వెళ్ళిపోయావు కదా అని కంగారుగా ఉలిక్కిపడి నిద్రలేస్తాను, ఇక రాత్రంతా నీ అలొచనలతొ నిద్రరాదు రా. నువ్వు కావాలంటే వచ్చి చూడు నా కళ్ళనిండా నీరిక్షణా దీపాలు ఎంత ఆశతో వెలుగుతున్నాయొ.
నాకలలకేంటిలే గాని రెండు శతాబ్దాలు telicast చేసినా ముగింపు లేని డైలి సిరియల్ లా వేల ఎపిసోడులు లెక్కల్లొ తయారై కుర్చున్నాయి.
ఆ మన సంతోషాలు ఆనందాలు నీ చిరునవ్వులు నీ చిరుకోపాలు లాలింపులు ఎక్కడికి పొయాయిరా ఈ రోజు. మళ్ళీఆ రోజులన్తు తిరిగి తీసుకువస్తావు కదూ!
ఎప్పటికి నీవాడు.


18 Response to "గుర్తుకొస్తున్నాయి."

  1. vamsy Says:
    July 23, 2009 at 9:43 PM

    మీ ప్రేమను మిస్ చేసుకుంటున్న ఆ అమాయకురాలు ఎవరో పాపం

  2. మురళి says:
    July 24, 2009 at 10:23 AM

    బహు చక్కని వ్యక్తీకరణ.. మీకు కవితలు రాసే అలవాటు ఉండి ఉంటుందని నా సందేహం...

  3. chytra Says:
    July 25, 2009 at 7:25 PM

    Heart touching letters.

  4. శ్రీ says:
    August 9, 2009 at 10:45 AM

    మీ బ్లాగు చూడటానికి కూడా చాల బాగుంది..

  5. కొత్త పాళీ says:
    August 9, 2009 at 4:59 PM

    చాలా బాగా రాశారు అంటే అది అస్సలు చాలా పేలవంగా ఉంది. మగాళ్ళకి సున్నితమైన మనసులేదు, మనసులో భావాల్ని అందంగా చెప్పే తీరు తెలియదు అని ఆరోపించేవారికి చక్కటి గుణపాఠం మీ రచన.

    couple of spellings:
    sandal
    telecast

  6. మరువం ఉష says:
    August 9, 2009 at 7:15 PM

    ఎంత సున్నితంగా సరళమైన భాషలో ఈ వ్యక్తీకరణ! వూహకే ఎంతో మధురం, [పూర్తిగా వూహా ప్రేయసి కాదని తలపోస్తూ] ఆ భగ్యవంతురాలు నిజంగా ఈ లోకాన అత్యంత అదృష్టవంతురాలు. మీరు ప్రేమ పిపాసలో ఉన్నతులు. చిన్ని చిన్ని చేతల్లో పెద్ద పెద్ద అనుభూతులు.

  7. రఘు says:
    August 10, 2009 at 7:57 AM

    వంశి,మురళి,చైత్ర, శ్రీ, కొత్తపాళి,ఉష గార్లకు దన్యవాదలు.

  8. Venkat says:
    September 8, 2009 at 5:38 PM

    next post eppudu?

  9. Ram Krish Reddy Kotla says:
    January 8, 2010 at 8:59 PM

    Raghu...that was excellent..who is that girl..n why did she miss u?

  10. పరిమళం says:
    February 6, 2010 at 11:43 AM

    మీ టెంప్లేట్ ...మీ శైలి ....మీ బ్లాగ్ పేరుకి తగ్గట్టు ప్రేమ పరిమళాలు వెదజల్లుతున్నాయ్!సున్నితత్వం ఉట్టిపడుతోంది మీ టపాల్లో !

  11. నేస్తం says:
    February 8, 2010 at 2:30 PM

    చాలా బాగా రాస్తున్నారు ...చక్కని టెంప్లెట్ ...:)

  12. ప్రణీత స్వాతి says:
    February 8, 2010 at 5:21 PM

    ఇది నిజమో..ఊహో తెలిదు కానీ చాలా బాగుందండీ.

  13. మధురవాణి says:
    February 8, 2010 at 7:52 PM

    beautiful template and beautiful post..!

  14. శివరంజని says:
    February 9, 2010 at 5:13 PM

    చాలా చాలా బాగా రాస్తున్నారు

  15. రఘు says:
    February 9, 2010 at 7:17 PM

    కృష్టారెడ్డిగారి కి ధన్యవాదాలు.ఆ అమ్మాయిని త్వరలోనే మీ అందరి ఆశిశ్శులతో కలిసి అప్పుడు మీకు పరిచయం చేస్తాను.కొన్ని కారణాలతోనే మా మద్య ఈ దూరం.

  16. రఘు says:
    February 9, 2010 at 7:20 PM

    పరిమళం గారికి ధన్యవాదాలు. ఆ పరిమళాలు ఆమెకు చేరాలనే నా ఆశ.

  17. రఘు says:
    February 9, 2010 at 7:24 PM

    నేస్తం గారికి ధన్యవాదాలు.ప్రణీతగారు ఉహ కాదండీ ఈ బాదంతా కల అయితే నిజంగానే బాగుండునండి.
    మదురవాణిగారికి,శివరంజని గారికి ధన్యవాదాలు.

  18. Anonymous Says:
    September 16, 2011 at 4:48 PM

    swetha:
    chana bagude ragu garu...

Post a Comment