జాబిల్లి కోసం ఆకాశమల్లే





పిచ్చి బంగారు,
నిన్నరాత్రి అటుపక్కనుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలాసేపు నిశబ్దంగా ఉండి తర్వాత పోన్ పెట్టేశావు అది నువ్వే కదా? Iam sure. నువ్వు మాట్లాడనే అక్కరలేదు రా, నీ శ్వాస తీవ్రత చాలు నాకు నువ్వని తెలుసుకోవడానికి. ఇన్ని సంవత్సరాల తర్వాతైనా గుర్తుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
మన మద్య ఎన్ని మాటలు ఉండేవి ఆ మాటలన్ని ఇప్పుడు ఎక్కడ పోగోట్టుకున్నావురా? అవునులే కలలన్ని కన్నీళ్ళలో కొట్టుకుపోయినపుడు మాటలు ముగిసిపోతాయంట!
అయినా phone అనే ఈ మూగ యంత్రానికి మౌన సందేశాలని రవాణా చేసే అలవాటుంది ఎన్ని లక్షల మంది ఉన్నారో? నాలాంటి వారు, నీలాంటివారు, మాటలు పూర్తికానివారు, మాటలు ముగిసినవాళ్ళు మౌనమే మాటైనవారు.
వద్దులే వదిలేయ్
ఎలా ఉన్నావు రా? నా నుంచి చా………లా….. దూరంగా… నేను మాత్రం నువ్వు వదిలి వెళ్ళిన నిశబ్దంలో నీ జ్ణాపకాలే ఉపిరిగా బ్రతుకుతున్నాను, ఒక్కోక్కసారి చాలా కష్టంగా ఉంటుంది రా.
ఒక్కోక్క సంవత్సరం గడిచిపోతే బాదకూడా తగ్గుతుందేమో అని అనుకున్నాను, కాని సాద్యం కాలేదు రా చెప్పుకున్న మాటలు, నీ ప్రేమ, నీ కోపాలు, నా రాజీలు పెట్టుకున్న ముద్దులు, మన బంగారు కలలు మరిచిపోవడం నా వల్ల కాలేదురా పిచ్చి!
రాత్రంతా మన మొదటి పరిచయపు జ్ణాపకాలే, అప్పుడే మంచులో తడిసిన నందివర్దనం తెలుపు చుడిదార్ వేసుకొని వచ్చిన క్షణంలోనే నేను నిన్ను ఇష్టపడ్డానా అని పదే పదే నా మనసుని ప్రశ్నించుకుంటాను గాని, నిన్ను చాలా చాలా ఇష్టపడటం నాలో మొదలైనపుడు మాత్రం నువ్వు కనకాంబరం రంగు చీర కట్టుకున్నావు అని గుర్తుకొచ్చింది, అవును పిచ్చి నా ఇష్టాలన్ని సేకరించిన నీకు నాకు ఆ కనకాంబరం కలర్ ఇష్టమని తెలిసే ఆరోజు ఆ చీర కట్టుకొని వచ్చావా! అని అడుగుదామనే ప్రశ్నకు నాకు జవాబు చెప్పడానికి వీలు కానంత దూరంలో నువ్వు ఉన్నావని గుర్తొచ్చి దిగులు కమ్ముకుంది.
" అక్షర అక్షరంలో నీ మధుర స్వర ఆలాపన వింటాను పంక్తి పంక్త్తిలో నీ జీవన దృక్కోణం స్వర్శిస్తాను" అంటూ ఎవరో కవి వ్రాసిన మాటలతో నీ ప్రేమ నిండిన ఉత్తరం నన్ను కదిలిస్తూనే ఉంది, వెన్నెల చెట్ల గుబురుల చీకట్లో కలుసుకున్న మధురానుభూతి నా జీవితమంతా పరిమళిస్తూనే ఉంటుంది, మన ఇద్దరి హృదయాల మద్య నలిగిన మల్లెల సువాసన ఇంకా నా శరీరాన్ని పట్టుకునే ఉంది రా
నా ప్రతి శ్వాస నిన్ను కలుసుకొవడానికి, ఎన్నో నీతో చెప్పడానికి బయలుదేరి నువ్వు ఉండాల్సిన చోట ఉండక మోసపోయి బరువెక్కిన బాదతో తిరిగోచ్చేస్తుంది.
నీ రూపాన్నే కళ్ళలో వెలిగించుకొని నీ కోసమే ఎదురు చూస్తూన్నా.
ఏవీ నీ పాదాల గుర్తులు………. ఎక్కడ….. నువ్వు…….
కంటి కిందకి రెండు చారలొచ్చాయి అయినా నువ్వు రాలేదు… ఇంకోన్నాళ్ళకి ఈ చారలే ముడతల్లోకి మారినా కళ్ళకి రెప్పల్ని కప్పుకునే ఆలోచన లేదు.
నువ్వురాని నాలోకంలో నేనుకాని
నేను.

17 Response to "జాబిల్లి కోసం ఆకాశమల్లే"

  1. Venkat says:
    February 9, 2010 at 4:26 PM

    thanemaina ee post choosthe, ekkadunna parugettukoni ravalsindhe. chaala chaala bavundhi

  2. Dev Says:
    February 9, 2010 at 6:25 PM

    Idhi dhenikaina Anuvadhama....

    Chala Baga rasaru....

  3. రఘు says:
    February 9, 2010 at 7:30 PM

    వెంకట్ ధన్యవాదాలు.
    Dev గారికి ధన్యవాదాలు.అవునండీ ఇది నా హృదయస్పందనలకు అక్షర అనువాదం.

  4. కొత్త పాళీ says:
    February 10, 2010 at 4:20 AM

    బాగా రాశారు

  5. భావన says:
    February 10, 2010 at 9:26 AM

    చాలా బాగా రాసేరు రఘు గారు. మీ హృదయ స్పందన లేఖ లో పలికింది. బరువెక్కిన ప్రతి శ్వాస ప్రియురాలి జాడ తెలియని బాధ తో పంచలేని కబుర్ల తో వెనక్కి వచ్చి గుండె దిగులు ను పెంచే ప్రియుని వూపిరవ్వటం.. అధ్బుతం గా వుందండి భావం. కలలన్ని కన్నీళ్ళ తో కొట్టూకు పోయినపుడు మాటలు ముగిసి పోతాయట.. :-) కలలన్ని కన్నీళ్ళ తో కొట్టుకుని పోయినప్పుడు మాట రంగు వెలిసి తెల్ల బోతుందనుకున్నానే నేను...

  6. Unknown says:
    February 10, 2010 at 1:53 PM

    Dear anna ,baga rasavu ane matalu saripovu, ne manasuloni badhani bhavaluga marchi mato panchukuntunavu, manasulo bhadani unchukuni cheragani churunavuto undatam neeku matrame sadyam.Nee jeevithamlo amavasya lanti cheekati rojulu poyi punnami nati vennela rojulu ravalani manasara korukuntu.
    Bujji

  7. రఘు says:
    February 10, 2010 at 4:29 PM

    కొత్తపాళీ గారికి ధన్యవాదాలు.

  8. రఘు says:
    February 10, 2010 at 4:31 PM

    భావన గారికి ధన్యవాదాలు.

  9. మురళి says:
    February 14, 2010 at 6:20 PM

    చాలా రోజుల తర్వాత కనిపించారు.. ఎప్పటిలాగే చాలాబాగా రాశారండీ.. చక్కని శీర్షిక జతకూడింది..

  10. Anonymous Says:
    April 1, 2011 at 9:17 PM

    రఘు గారు,

    చాలా ఆలస్యంగా మీ బ్లాగు చూసి, మొత్తం పోస్టులన్నీ చదివాను. గ్రేట్.

  11. Unknown says:
    April 19, 2011 at 8:15 PM

    me bhava vyaktikarana chakkaga undandi...

    http://kallurisailabala.blogspot.com

  12. yahoo says:
    August 25, 2011 at 10:44 PM

    gud and come again with new post

  13. Anonymous Says:
    September 16, 2011 at 4:30 PM

    swetha:
    ragu garu chana baga rasaru sir.... meru racede na frd jevetha neke chana degara polekalu vunae ragu garu.... naku me contact num kava le ragu garu......

  14. Anonymous Says:
    September 17, 2011 at 6:46 PM

    swetha:
    my frd also read is ragu garu once call to her

  15. Anonymous Says:
    September 17, 2011 at 6:46 PM

    swetha:
    my frd also read is ragu garu once call to her

  16. నేస్తం says:
    September 21, 2011 at 12:18 PM

    ఈ పోస్ట్ లేట్గా చూసాను..దీనికి ప్రేరణ ఎవరోగాని అసలు మీరు భలే రాస్తున్నారు..

  17. Unknown says:
    April 20, 2012 at 2:49 AM

    సున్నితంగా....heart touching!
    Nice.

Post a Comment