నీ నిరీక్షణ లో



Dear వసూ...
ఒక్కసారి ని చేయి ఇలాఇవ్వు... నీ అరచేతిలో వచ్చే కొత్తసంవత్సరంలో నాజీవితాన్ని,నాప్రేమని, నాఆశలని చూసుకొని ఒక చిన్న ముద్దుపెట్టుకొని వదులుతాను.
ఆరోజు 31st అర్దరాత్రి ఎక్కడుంటావు మిత్రమా? నాకు తెలుసు ఆరొజు నువ్వు గడియరంలొని పెద్దముల్లుని చుస్తూ నిలిచి ఉన్నప్పుడు నీ మదిలో నాపేరున్న ఒక పూవు వికసిస్తుంది అదినాకు తెలుసు, నీ చుట్టూ మీ అమ్మ నాన్నా అన్నయ్యలు అందరు నిలిచిఉంటారు."happy new year mahi" అని నువ్వు అరచి చెప్పలేవు. అందుకే ఒక్కసారి నీ నుదిటి మద్యనున్న బొట్టుని తాకిచుడు దాని చివరలొ నేనుంటాను, నీ పెదవి చివరన ఉన్న పుట్టుమచ్చను ఒక్కసారి చేతితో తడిమిచుడు అక్కడా నేనుంటాను, సరేనా. 31stరాత్రి గడియరం ముల్లు 12 దాటుతుంటే మై డియర్ నీ మౄదువైన కాలి వేల్లతొ చిన్నగా ఒక్కసారి నేలను మిటుచాలు ఇక్కడ నాఅత్మకి ఎవరో తలుపుతట్టి చెప్పినట్టు నీ సందేశం నామనస్సుకి తెలుస్తుంది.
నీ ప్రతి అడుగులో, నీ ఉపిరిలో, నీ ప్రతి ఆలొచనలోను నేనుఉన్నాను వసూ.నీ కళ్లనిండా నిండా నిండీవున్నఆశల్లో నా రూపం నిండి ఉంటుంది. పిచ్చి ప్రపంచం ఇకముందు నిన్ను చూడకూడదు, నీతో మాట్లడకూడదు..మీరిద్దరూ ప్రేమించుకోకూడదు అని హద్దులు పెడుతుంది వాళ్ళకేంతెలుసు వసూ..? నువ్వు నేను ఒకరినొకరు ప్రేమించకుండా ఉంటే ఈ ప్రపంచంలోని ఏ జీవి ఇంకోక జీవిని ప్రేమించదు అని.
సరేలే వాళ్ళందరి గురించి ఆలోచించి మనసుపాడు చేసుకొవద్దు. రాబోయే సంవత్సరం కేవలం మన ఇద్దరిదే, ఈకష్టాలుఅన్నీ మననుంచి దూరంగ వెల్లిపొతాయి. మీ నాన్నా హౄదయం మౄదువుగా మారుతుంది. మీ అమ్మ ప్రేమగా నిన్ను "అమ్మవసూ" అని దగ్గరకు తీసుకుంటుంది. నీ ప్రియమైన చెల్లి కళ్ళలొ చిలిపిదనం, చూస్తూఉండు నువ్వే మీ అన్నయ్య స్వయంగా మా ఇంటిదాకా వచ్చి "హలొ మహేష్" అంటాడూ. నాకు తెలుసు వసూ వచ్చే కోత్త సంవత్సరం మనద్దిరిని కలపకుండా వెళ్ళిపోదు అని.
బయపడకు వసూ నేను పదేపదే మీఇంటి వైపు రానులే అలా రావటం వల్ల నీకు ఎంత కష్టమొ తెలుస్తుంది.
ఇంట్లొ ఎన్నో ప్రశ్నలు అడుగడుగికి హద్దులు, ప్రతి మాటకి ఎన్నో అర్దాలు నీ జీవితన్ని చాలా నరకంగా మర్చేస్తారు. అందుకనే ఇకముందు నేను రాను వసూ ఇంక తప్పక వచ్చితిరాలి నిన్ను చూడకుండా ఉండాలేను అని అన్పించినపుడు నేను ఆ విశాలాగగనంలోని చివరినక్షత్రాన్ని చూసి తౄప్తిపడుతాను,దాని చిన్నికళ్ళలొ నువ్వు ఉంటావు, ఆ నక్షత్రం నావైపు ప్రేమగా చూసి తలుక్కున మెరుస్తుంది.
నాకు ఎంచేయలో తోచలేదు వసూ, ఆకాశంలోని ఒక చిన్న నక్షత్రానికి నీ పేరు పేట్టెసాను. so lovely you know?
దానికి నీకన్నా మంచి మనసుంది. ఎలంటి అమవాస్య అర్దరాత్రియినా సరే పాపం నాకొసం ఆశగా ఆకాశం లో ఎదురుచూస్తూ ఉంటుంది. నేను ఎ మూలనున్న hai mahi అని పలకరిస్తుంది, దానికి కూడా నామిద నీకున్నంత ప్రేమ కరుణ ఉన్నయి. నీ కున్నట్లుగా దాని చుట్టూ సమాజపు అడ్డుగోడలు లేవు, ఇంట్లో వాళ్ళ అంక్షలు లేవు.
అయినా వసూ డియర్ ఇవన్ని నాకు నేను ఎకాంతములొ చెప్పుకునే పిచ్చి సమాదానాలని కూడా నాకు తెలిసిపొయింది. ఏ నక్షత్రాన్నో చూసి మైమరచి నిద్రలొకి జారిపోయినా ఉదయం కళ్ళు తెరిచిన మరుక్షణం మనసు "నాకు వసూ కావాలి" అని మారం చేస్తుంది.. దానిని ఎంత దండించినా, ఎంత మాయచేసినా, ఎంతముద్దుచేసినా ఉహూ వింటేనా దానికి నువ్వే కావాలి ఎంచేయను చెప్పు.
అలా మనస్సు మరీ గోడవ చేసినపుడే నేను ఇంక తప్పక మీ ఇంటీ వైపు ఎవరోచెయిపట్టుకొని లాగినట్టుగా నడిచి వచేస్తాను. నువ్వు కనిపిస్తావెమొనని ఆశగా మీ ఇంటి వకిలివైపు కిటికివైపు చూడటం.ఉరికే మి phone కి blanck calls చేయ్యటం. ఇంక మళ్ళీ నన్ను నేను english లొ తిట్టుకొని ఉరుకోవడం అలవాటుఅయిపొయింది.
చాలు వసూ ఇంకచాలు నేను బరించలేను ఈ కొత్తసంవత్సరంలో ఏ సమస్యలు లేకుండా హయిగా ఉందాం, అలా ఉండేలా చూడమని దేవుడ్నికోరుకో వసూ, అయినా ఇక్కడా ఒక సమస్య ఉంది చూడు, ప్రపంచంలొని అన్ని పండుగలకి ఎవరో ఒక దేవుడు ఉంటాడు, ఆకరికి కాముని పౌర్ణమి కి కూదా మన్మదుడు అనే stupid దేవుడున్నాడు కాని ఏదేవుడు లేని ప్రపంచంలొని ఎకైక పండుగ అంటె ఈ నూతన సంవత్సరపు పండుగే, ఆరోజు రాత్రి అన్ని దేవుళ్ళకి అర్దరాత్రి సెలవంట మరి ఏ దేవుడ్ని కొరుకుంటావు వసూ.
అయినా మన పిచ్చిగాని మనకష్టం దేవుడుకేం తెలుస్తుంది చెప్పు? అందుకే నేనోక నిర్ణయానికోచ్చాను, నూతనసంవత్సరపు ఆ నిశబ్దక్షణలలో నా మది కోవెలలొని గర్బపిఠం నుంచి అన్ని దేవుళ్ళు శలవు తేసుకున్నపుడు అక్కడ కేవలం నిన్ను మాత్రమే ప్రతిష్టించుకుంటాను,ఆరోజు మంత్రాలు చదవక్కరలేదు, మట్లాడక్కరలేదు పుష్పం పత్రం సమర్పించక్కరలేదు. నా చిన్ని ఆశలని నైవేద్యంగా పేట్టి కళ్ళతోనే హరతి సమర్పించుకుంటాను, నా ఈ హౄదయం కేవలం నీ ఙ్ణాపకలలో, నీ ఆరాదనలో, నీ నిరిక్షణలో ఈ నూతన సంవత్సరపు అర్దరాత్రి మొత్తం నిండిపోతుంది.
నువ్వు అక్కడ మీఇంటిలో రాత్రి నిద్రరాని జాములో నేను గుర్తుకోచ్చి ఒక వెచ్చని కన్నిటి చుక్క నీ కంటి చివరనుంచి నిశబ్దంగా చెక్కిలి మీదకీ జారినపుడు నీ మనసు మన ఆశల జీవితసౌదం గురించి ఆలొచిస్తూ ఉండిపోతుంది కదూ!
any way wish you happy new year.
your's for ever
mahe.

12 Response to "నీ నిరీక్షణ లో"

  1. Padmarpita says:
    July 5, 2009 at 2:20 AM

    సున్నితంగా టచ్ చేసారు....బాగుందండి.

  2. రఘు says:
    July 5, 2009 at 6:20 PM

    padmarpita గార్కి చాలా సంతోషం కలిగింది మి comment చూసి.నాకు అందిన 1st comment మిదేనండి. ఉరుకూరికే పెదవుల మీద నవ్వు వచ్చేస్తుంది. ఎన్ని సార్లు చదువుకున్నానో మీ వ్యాక్య. thankyou.

  3. venkat Says:
    July 6, 2009 at 3:47 PM

    అబ్బొ! నీలో చాల కళ వుంది.
    నీ వసు ఇది చూడాలని ఆశిస్థూ...

  4. vignesh ,Raghu says:
    July 8, 2009 at 8:45 AM

    మీకు లెటర్లో మంచి పొయిట్రి వుంది

  5. మురళి says:
    July 10, 2009 at 5:27 PM

    రఘు గారూ.. చాలా చక్కగా రాశారు... ఇలాగే కొనసాగించండి.. అభినందనలు.

  6. రఘు says:
    July 10, 2009 at 6:02 PM

    మురళి గార్కి, మీరు నా బ్లాగు చూసారన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మీ నెమలికన్ను చూసాకే నేను రాయలని మొదలుపెట్టాను. thankyou

  7. నేస్తం says:
    July 10, 2009 at 7:50 PM

    నిజంగా ఎంత బాగా రాసారంటే నాకు చాలా చాలా నచ్చింది .. ఇంతకు మించి చెప్పలేను అంత బాగుంది

  8. సుజాత వేల్పూరి says:
    July 10, 2009 at 10:21 PM

    పుట్టి పెరిగింది ఇంటీరియర్ కర్నాటక అయినా మంచి తెలుగు రాస్తున్నారు.అంతే కాదు, మంచి వ్యక్తీకరణ(expression) కూడా! బ్లాగు పేరు తెలుగులో కనపడేట్టు చూడండి రఘు గారూ! ఇంత మంచి పేరు ఇంగ్లీషులో కంటే తెలుగులో ఇంకా అందంగా కనపడుతుంది.

  9. ఆత్రేయ కొండూరు says:
    July 11, 2009 at 12:34 AM

    రఘు గారు బాగారాశారండీ.. చాలా సున్నితంగా ఉంది.

  10. రఘు says:
    July 11, 2009 at 7:46 AM

    Thank you, thank you very much.
    మీ అందరు ఇలా చెపుతుంటే చాలా సంతోషంగా ఉంది.

  11. ತಿರಸ್ಕೃತ says:
    December 12, 2010 at 12:04 PM
    This comment has been removed by the author.
  12. ತಿರಸ್ಕೃತ says:
    December 12, 2010 at 12:06 PM

    dear friends

    hai my name is basavaraju. i am a kannadiga. naaku chalam raasina premalekhalu pusthakam lekapothe aa pusthakanloni oke oka padhymaina kavali, i am a big fan of chalam the great.please friend if you have please send me.
    basavaraju41@gmail.com its my email adress.

    with regards
    basavaraju.

Post a Comment