నీవు లేవు నీ జ్ఞాపకం వుంది



నా జీవితానికి చివరి చైత్రమాసమా.
నీ కంటిపాపలో నా ప్రతిబింబాన్ని ఒకటి దాచుకోరా. ఎప్పుడైనా మన జ్ణాపకాలు కన్నీరుగా మారి చెంపలపై జారి నీ సౌందర్యాన్ని కరిగించకుండా నిలుపుతుంది.
ఇదేలా సాద్యం అవుతుంది పిచ్చి? అక్కడెక్కడో నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఇక్కడ నా పెదవులు ఎందుకు విరబూస్తాయి, నీ వాకిట్లో పున్నమి వెన్నెల వర్షం కురిస్తే ఇక్కడేందుకు నా హృదయసాగరం ఉప్పోంగుతుంది, నీ కళ్ళు తడిబారితే నా కళ్ళెందుకు మసకబారుతాయి రా.తనకేంటిలే కొత్త ఉరు, కొత్తజీవితం, కొత్త కలలు బాగానే ఉందిలే ఆమెకెక్కడ నేను గుర్తురావాలి ఆమె సుఖంలో ఆమె హయిగా ఉంది అని అనుకొని ఇన్ని సంవత్సరాలు గడిపాను.
ఇంకా గుర్తుంచుకుంటాడా ఆరోజే మరచిపోయి ఉంటాడు, ముందే ఒఠ్ఠి బుద్దవతారం జ్ణాపకాలన్ని భద్రంగా దాచుకొనే వాడయితే నన్నెందుకు పోగొట్టుకుంటాడు పాటికి పూర్తిగా మరచిపోయిఉంటాడు మళ్ళీ అమ్మాయిని చూసాడో తనవిషయం ఎందుకులే అనుకొని నువ్వు బ్రతికేస్తున్నావు.
మన మిద్దరం మనల్ని మనమే ఎంత మోసం చేసుకుంటున్నామో కదా బంగారు.
ఇన్ని సంవత్సరాల తర్వతా మనం కలిస్తే ఎం మాట్లాడుకుంటాం రా?
నాకు తెలుసు,నువ్వు చూసిన వెంటనే మాట్లాడవు, నీ కళ్ళు క్షేమ సమాచారాలు అడుగుతాయి, నా కళ్ళలో లక్షదీపోత్సవాలు, నువ్వు అప్పుడే గుడికి వెల్లివచ్చుంటావు నుదుటున కుంకుమ, జడలో పూలు, అరచేతిలో ఉన్న పటికబెల్లం. మనమిద్దరం అందరినుంచి దూరంగా ఇద్దరే సృష్టించుకున్న మౌనంలో నువ్వు మెల్లగా నన్నుచేరినా ఎదమీద నీ తలవాల్చి నిల్చుంటావు...... ఇద్దరి హృదయ స్పందనలలో ఎవ్వరూ ఎప్పుడు వినని గీతం.
వద్దులే వదిలేయి పిచ్చి పాతగాయాన్ని మళ్ళి రేపడం ఎందుకు పోన్ ఎత్తి మాట్లడటానికి కూర్చుంటే మాటలన్నీ మర్చిపోయి ఇంకా? ఇంకా ? అంటూ ఆలోచించే స్థితికి వచ్చేసాము దానికన్న దుస్థితి కావాలా?తెలుసులే బంగారు ! నేను ఊరికే నిన్ను పాత జ్ణాపకాల దారిలో నిలబెట్టనులేరా. నీ భయం ఏంటని నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు.
అయ్యిందేదో అయ్యిందిలే కళ్ళలో ఎందుకు దుఃఖం! మనం ప్రేమించుకుంది నిజం, అదంతే నిజం రోజు దానిని మాత్రమే గౌరవిద్దం దానిని మాత్రమే గుర్తుంచుకుందాం. జన్మకి ఇదిచాలు పిచ్చి ఊరికే ఆశపడటం ఎందుకు? నీ జీవితం హయిగా వుండని చాలు, మనశ్శాంతిగా జీవించు చాలు.
అయితే బంగారు ఎప్పుడైనా నీ పాప కి కథ చెప్పేటప్పుడు మాత్రం కోటలోని రాజకుమారి ఒక సామాన్యుడిని ప్రేమించిన కథ మాత్రం చెప్పకు అలాంటి కథల్లో ఎప్పుడు నేను వుంటాను. కాని రాజకుమారి మాత్రం వేరెవరి కోటలోనో ఉంటుంది. అది నన్ను బాదిస్తుంది.

జాబిల్లి కోసం ఆకాశమల్లే





పిచ్చి బంగారు,
నిన్నరాత్రి అటుపక్కనుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలాసేపు నిశబ్దంగా ఉండి తర్వాత పోన్ పెట్టేశావు అది నువ్వే కదా? Iam sure. నువ్వు మాట్లాడనే అక్కరలేదు రా, నీ శ్వాస తీవ్రత చాలు నాకు నువ్వని తెలుసుకోవడానికి. ఇన్ని సంవత్సరాల తర్వాతైనా గుర్తుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
మన మద్య ఎన్ని మాటలు ఉండేవి ఆ మాటలన్ని ఇప్పుడు ఎక్కడ పోగోట్టుకున్నావురా? అవునులే కలలన్ని కన్నీళ్ళలో కొట్టుకుపోయినపుడు మాటలు ముగిసిపోతాయంట!
అయినా phone అనే ఈ మూగ యంత్రానికి మౌన సందేశాలని రవాణా చేసే అలవాటుంది ఎన్ని లక్షల మంది ఉన్నారో? నాలాంటి వారు, నీలాంటివారు, మాటలు పూర్తికానివారు, మాటలు ముగిసినవాళ్ళు మౌనమే మాటైనవారు.
వద్దులే వదిలేయ్
ఎలా ఉన్నావు రా? నా నుంచి చా………లా….. దూరంగా… నేను మాత్రం నువ్వు వదిలి వెళ్ళిన నిశబ్దంలో నీ జ్ణాపకాలే ఉపిరిగా బ్రతుకుతున్నాను, ఒక్కోక్కసారి చాలా కష్టంగా ఉంటుంది రా.
ఒక్కోక్క సంవత్సరం గడిచిపోతే బాదకూడా తగ్గుతుందేమో అని అనుకున్నాను, కాని సాద్యం కాలేదు రా చెప్పుకున్న మాటలు, నీ ప్రేమ, నీ కోపాలు, నా రాజీలు పెట్టుకున్న ముద్దులు, మన బంగారు కలలు మరిచిపోవడం నా వల్ల కాలేదురా పిచ్చి!
రాత్రంతా మన మొదటి పరిచయపు జ్ణాపకాలే, అప్పుడే మంచులో తడిసిన నందివర్దనం తెలుపు చుడిదార్ వేసుకొని వచ్చిన క్షణంలోనే నేను నిన్ను ఇష్టపడ్డానా అని పదే పదే నా మనసుని ప్రశ్నించుకుంటాను గాని, నిన్ను చాలా చాలా ఇష్టపడటం నాలో మొదలైనపుడు మాత్రం నువ్వు కనకాంబరం రంగు చీర కట్టుకున్నావు అని గుర్తుకొచ్చింది, అవును పిచ్చి నా ఇష్టాలన్ని సేకరించిన నీకు నాకు ఆ కనకాంబరం కలర్ ఇష్టమని తెలిసే ఆరోజు ఆ చీర కట్టుకొని వచ్చావా! అని అడుగుదామనే ప్రశ్నకు నాకు జవాబు చెప్పడానికి వీలు కానంత దూరంలో నువ్వు ఉన్నావని గుర్తొచ్చి దిగులు కమ్ముకుంది.
" అక్షర అక్షరంలో నీ మధుర స్వర ఆలాపన వింటాను పంక్తి పంక్త్తిలో నీ జీవన దృక్కోణం స్వర్శిస్తాను" అంటూ ఎవరో కవి వ్రాసిన మాటలతో నీ ప్రేమ నిండిన ఉత్తరం నన్ను కదిలిస్తూనే ఉంది, వెన్నెల చెట్ల గుబురుల చీకట్లో కలుసుకున్న మధురానుభూతి నా జీవితమంతా పరిమళిస్తూనే ఉంటుంది, మన ఇద్దరి హృదయాల మద్య నలిగిన మల్లెల సువాసన ఇంకా నా శరీరాన్ని పట్టుకునే ఉంది రా
నా ప్రతి శ్వాస నిన్ను కలుసుకొవడానికి, ఎన్నో నీతో చెప్పడానికి బయలుదేరి నువ్వు ఉండాల్సిన చోట ఉండక మోసపోయి బరువెక్కిన బాదతో తిరిగోచ్చేస్తుంది.
నీ రూపాన్నే కళ్ళలో వెలిగించుకొని నీ కోసమే ఎదురు చూస్తూన్నా.
ఏవీ నీ పాదాల గుర్తులు………. ఎక్కడ….. నువ్వు…….
కంటి కిందకి రెండు చారలొచ్చాయి అయినా నువ్వు రాలేదు… ఇంకోన్నాళ్ళకి ఈ చారలే ముడతల్లోకి మారినా కళ్ళకి రెప్పల్ని కప్పుకునే ఆలోచన లేదు.
నువ్వురాని నాలోకంలో నేనుకాని
నేను.

గుర్తుకొస్తున్నాయి.





ఓరెయ్ బంగారు,
ఇక్కడ నువ్వు ఉండి ఉంటే అనే ఆలొచనే చాలు నా మనసు శరీరం పులకించిపోవడానికి, నువ్వుంటే ఇలాఉండును నువ్వుంటే ఆలా ఉండును, నువ్వు ఇలా అనేదానివి ఆమాటలు నేను మైమరచివినేవాడిని, ఈ వెన్నల రాత్రీలో నువ్వు నాపక్కన మెరుస్తూ ఉండేదానివి, ఆ మెరుపు కాంతి నా కళ్ళనిండా నిండి కొత్త ప్రపంచన్ని చూస్తూ ఉందును.
నువ్వు నాజీవితంలోకి రాకముందు నా జీవితం ఇలా ఉండేది కాదు తెలుసా? తలదువ్వుకునేటప్పుడు బూట్లు వేసుకొవాలా చెప్పులు వేసుకోవాలా అని ఆలొచించేవాడిని.షర్టు బటన్స్ పెట్టుకునేటఫ్ఫుడు బైకులో పెట్రోల్ ఉందో లేదోనని ఆలోచించేవాడిని. అన్నంలో మజ్జిగ పోసుకునేటప్పుడు ఎక్కడో కర్చిప్ వదిలివేసిన విషయం గుర్తుకువచ్చేవి. కాని ఇప్పుడలా కాదురా... నాన్నా తిడుతున్నా కీరవాణి పాటాలా అనిపిస్తుంది, accounts లో టోటల్ మిస్ అవుతుంటే నీకుపెట్టకుండా వదిలేసిన నా ముద్దులు గుర్తుకొస్తున్నాయి, అద్దం ముందు నిల్చుని తలదువ్వుకుంటుంటే వెనకనుంచి వచ్చి నా క్రాప్ చెరిపినట్టు అనిపిస్తుంది ఎమైందిరా నీకు అని అమ్మ అడిగితే అమ్మా నాకుమెరిసే నక్షత్రం దొరికింది అని అరచి చెప్పాలనిపిస్తుంది.
అమ్మాయిల ప్రపంచం విచిత్రం కదా? మీకు ఏమి కావాలో అనేది తేలుసుకొవడనికే సగం జీవితం గడిచిపోతుంది. అయినా మీకేమి కావాలో అవి అన్నీ కంటిచివర చూపులతోనే చూపించి తప్పకుండా మానుండి చేపించుకుంటారు కదా! ఎంత తెలివైన వారో మీరు! ప్రేమించే అబ్బాయిలు ఎప్పడు డెటాల్ లాంటి సబ్బులు వాడకూడదు ఎమున్నా mysore sandel లాంటి soap బాగుంటుంది అని నీ నుంచి వచ్చిన మాటకు రూమునిండా sandel soaps తో నింపేసాను తెలుసా? ఎదురుగా కూర్చుని బొగ్గు ఇంజన్ రైలులాగా సిగరెట్ కాల్చి పొగవదలడం ఇష్తం లేదన్నావే, ఇకముందు ఒట్టు సిగరెట్ ముట్టను అని చెప్పి అక్కడ ఎక్కడో దొంగచాటుగా సిగరెట్ కాల్చి క్రేన్ ఒక్కపొడి తిని నీకు ముద్దు పెడుతానికి వచ్చి దొరికిపొతాను చూడు! అది ఇష్టం అని చూచించింది నువ్వే.
సాదారణంగా అబ్బాయిలు కలలోకి తన ప్రేయసి రావాలని ఆశించి నిదురపొ్తారు. కలకై ఎదురు చూస్తారు, అయితే నేను అలా కాదురా పిచ్చి, కలలోకి వచ్చిన నువ్వు దారి తెలవక కనీసం అడగకుండా వెళ్ళిపోయావు కదా అని కంగారుగా ఉలిక్కిపడి నిద్రలేస్తాను, ఇక రాత్రంతా నీ అలొచనలతొ నిద్రరాదు రా. నువ్వు కావాలంటే వచ్చి చూడు నా కళ్ళనిండా నీరిక్షణా దీపాలు ఎంత ఆశతో వెలుగుతున్నాయొ.
నాకలలకేంటిలే గాని రెండు శతాబ్దాలు telicast చేసినా ముగింపు లేని డైలి సిరియల్ లా వేల ఎపిసోడులు లెక్కల్లొ తయారై కుర్చున్నాయి.
ఆ మన సంతోషాలు ఆనందాలు నీ చిరునవ్వులు నీ చిరుకోపాలు లాలింపులు ఎక్కడికి పొయాయిరా ఈ రోజు. మళ్ళీఆ రోజులన్తు తిరిగి తీసుకువస్తావు కదూ!
ఎప్పటికి నీవాడు.


నీ ఙ్ణాపకం



నిన్న చాలా వర్షం వచ్చిందిరా నీ ఙ్ణాపకంలా అప్పుడు ఎక్కడ ఉన్నావు పిచ్చి? మి ఇంటి అరుగు మీద నుంచుని నన్ను మరచిపొయే ప్రయత్నం చేస్తున్నావా బంగారు? అంత ఈజీ కాదురా బంగారు మరచిపొవడం కంటీచివర నుంచి కన్నిళ్ళని తుడిచివేసినట్టు నన్ను ఎప్పటీకి నువ్వు తుడీచి వేయలేవు రా
ఎక్కడ నిల్చుని నన్ను మరచిపొతావు చెప్పు? ఎందుకు రా నన్ను ఇలా వదలివెళ్ళావు? వెళ్ళీనదానివి వెళ్ళావు మళ్ళి ఎందుకు ఇంతగా గుర్తుకొస్తున్నావు?
ఇంత బయంకరమైన ఎకాంతాన్ని ఎలా బరిస్తున్నానొ? ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడికి వెళ్ళలెదు ఇక్కడే ఉన్నావు అనిపిస్తుంది. అమ్మకి చెప్పి ఇప్పుడే వచ్చెస్తాను అని వెళ్ళినట్టు అనిపిస్తుంది. నా శరిరం అంతా ని పరిమళమే, నువ్వు ఇక్కడే ఉన్నట్టు ఇంటి వెనుక మొక్కల్లో ఎదో అలజడి, ఉరికే అడుగుల చప్పుడు రాత్రంతా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. తీరా లేచివెళ్ళిచూస్తే అంతా కటికచికటి, అక్కడ నువ్వు కనిపించడం లేదు.
నీ నుంచి దురమైతే బ్రతకడం కష్టం అని తెలుసు hurt అవుతాను, ఒంటరినవుతను అని తెలుసు......అయితే తీరా ఇంత miss అవుతాను అని అనుకొలేదు బంగారు ofcourse నిన్ను ద్వేషిస్తాను అని కలలో కూడా అనుకొలేదు, అయితే ప్రేమించకుండా ఉండిపొవలి అనుకున్నాను. ఇకముందు ఈ ప్రేమా అనురాగం అప్యాయతలు ఏదీవద్దు. అన్నీ ఉత్తీ స్వార్దం ఒక్కడినే ఉండిపొవాలి ప్రసాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది. జీవితంలో ఎదైనా సాదించాలి అందరూ గొప్పగా చూచేలా డబ్బు సంపాదించాలి ఇలా ఎవేవొ ఆలొచనలు రా . అయితే తమాసా చూడు నేను వేసే అడుగుకి కనీసం Goodluck చేప్పడనికైనా నువ్వుకావాలి అనిపిస్తుంది.
నిజంగా చేప్పనా...? నాకు నిన్ను వదలి ఉండటం అవ్వదురా పిచ్చి..నువ్వు లేకపొతే బ్రతకలెను రా.......
ఎప్పటికీ నీ
రఘు.

నీ నిరీక్షణ లో



Dear వసూ...
ఒక్కసారి ని చేయి ఇలాఇవ్వు... నీ అరచేతిలో వచ్చే కొత్తసంవత్సరంలో నాజీవితాన్ని,నాప్రేమని, నాఆశలని చూసుకొని ఒక చిన్న ముద్దుపెట్టుకొని వదులుతాను.
ఆరోజు 31st అర్దరాత్రి ఎక్కడుంటావు మిత్రమా? నాకు తెలుసు ఆరొజు నువ్వు గడియరంలొని పెద్దముల్లుని చుస్తూ నిలిచి ఉన్నప్పుడు నీ మదిలో నాపేరున్న ఒక పూవు వికసిస్తుంది అదినాకు తెలుసు, నీ చుట్టూ మీ అమ్మ నాన్నా అన్నయ్యలు అందరు నిలిచిఉంటారు."happy new year mahi" అని నువ్వు అరచి చెప్పలేవు. అందుకే ఒక్కసారి నీ నుదిటి మద్యనున్న బొట్టుని తాకిచుడు దాని చివరలొ నేనుంటాను, నీ పెదవి చివరన ఉన్న పుట్టుమచ్చను ఒక్కసారి చేతితో తడిమిచుడు అక్కడా నేనుంటాను, సరేనా. 31stరాత్రి గడియరం ముల్లు 12 దాటుతుంటే మై డియర్ నీ మౄదువైన కాలి వేల్లతొ చిన్నగా ఒక్కసారి నేలను మిటుచాలు ఇక్కడ నాఅత్మకి ఎవరో తలుపుతట్టి చెప్పినట్టు నీ సందేశం నామనస్సుకి తెలుస్తుంది.
నీ ప్రతి అడుగులో, నీ ఉపిరిలో, నీ ప్రతి ఆలొచనలోను నేనుఉన్నాను వసూ.నీ కళ్లనిండా నిండా నిండీవున్నఆశల్లో నా రూపం నిండి ఉంటుంది. పిచ్చి ప్రపంచం ఇకముందు నిన్ను చూడకూడదు, నీతో మాట్లడకూడదు..మీరిద్దరూ ప్రేమించుకోకూడదు అని హద్దులు పెడుతుంది వాళ్ళకేంతెలుసు వసూ..? నువ్వు నేను ఒకరినొకరు ప్రేమించకుండా ఉంటే ఈ ప్రపంచంలోని ఏ జీవి ఇంకోక జీవిని ప్రేమించదు అని.
సరేలే వాళ్ళందరి గురించి ఆలోచించి మనసుపాడు చేసుకొవద్దు. రాబోయే సంవత్సరం కేవలం మన ఇద్దరిదే, ఈకష్టాలుఅన్నీ మననుంచి దూరంగ వెల్లిపొతాయి. మీ నాన్నా హౄదయం మౄదువుగా మారుతుంది. మీ అమ్మ ప్రేమగా నిన్ను "అమ్మవసూ" అని దగ్గరకు తీసుకుంటుంది. నీ ప్రియమైన చెల్లి కళ్ళలొ చిలిపిదనం, చూస్తూఉండు నువ్వే మీ అన్నయ్య స్వయంగా మా ఇంటిదాకా వచ్చి "హలొ మహేష్" అంటాడూ. నాకు తెలుసు వసూ వచ్చే కోత్త సంవత్సరం మనద్దిరిని కలపకుండా వెళ్ళిపోదు అని.
బయపడకు వసూ నేను పదేపదే మీఇంటి వైపు రానులే అలా రావటం వల్ల నీకు ఎంత కష్టమొ తెలుస్తుంది.
ఇంట్లొ ఎన్నో ప్రశ్నలు అడుగడుగికి హద్దులు, ప్రతి మాటకి ఎన్నో అర్దాలు నీ జీవితన్ని చాలా నరకంగా మర్చేస్తారు. అందుకనే ఇకముందు నేను రాను వసూ ఇంక తప్పక వచ్చితిరాలి నిన్ను చూడకుండా ఉండాలేను అని అన్పించినపుడు నేను ఆ విశాలాగగనంలోని చివరినక్షత్రాన్ని చూసి తౄప్తిపడుతాను,దాని చిన్నికళ్ళలొ నువ్వు ఉంటావు, ఆ నక్షత్రం నావైపు ప్రేమగా చూసి తలుక్కున మెరుస్తుంది.
నాకు ఎంచేయలో తోచలేదు వసూ, ఆకాశంలోని ఒక చిన్న నక్షత్రానికి నీ పేరు పేట్టెసాను. so lovely you know?
దానికి నీకన్నా మంచి మనసుంది. ఎలంటి అమవాస్య అర్దరాత్రియినా సరే పాపం నాకొసం ఆశగా ఆకాశం లో ఎదురుచూస్తూ ఉంటుంది. నేను ఎ మూలనున్న hai mahi అని పలకరిస్తుంది, దానికి కూడా నామిద నీకున్నంత ప్రేమ కరుణ ఉన్నయి. నీ కున్నట్లుగా దాని చుట్టూ సమాజపు అడ్డుగోడలు లేవు, ఇంట్లో వాళ్ళ అంక్షలు లేవు.
అయినా వసూ డియర్ ఇవన్ని నాకు నేను ఎకాంతములొ చెప్పుకునే పిచ్చి సమాదానాలని కూడా నాకు తెలిసిపొయింది. ఏ నక్షత్రాన్నో చూసి మైమరచి నిద్రలొకి జారిపోయినా ఉదయం కళ్ళు తెరిచిన మరుక్షణం మనసు "నాకు వసూ కావాలి" అని మారం చేస్తుంది.. దానిని ఎంత దండించినా, ఎంత మాయచేసినా, ఎంతముద్దుచేసినా ఉహూ వింటేనా దానికి నువ్వే కావాలి ఎంచేయను చెప్పు.
అలా మనస్సు మరీ గోడవ చేసినపుడే నేను ఇంక తప్పక మీ ఇంటీ వైపు ఎవరోచెయిపట్టుకొని లాగినట్టుగా నడిచి వచేస్తాను. నువ్వు కనిపిస్తావెమొనని ఆశగా మీ ఇంటి వకిలివైపు కిటికివైపు చూడటం.ఉరికే మి phone కి blanck calls చేయ్యటం. ఇంక మళ్ళీ నన్ను నేను english లొ తిట్టుకొని ఉరుకోవడం అలవాటుఅయిపొయింది.
చాలు వసూ ఇంకచాలు నేను బరించలేను ఈ కొత్తసంవత్సరంలో ఏ సమస్యలు లేకుండా హయిగా ఉందాం, అలా ఉండేలా చూడమని దేవుడ్నికోరుకో వసూ, అయినా ఇక్కడా ఒక సమస్య ఉంది చూడు, ప్రపంచంలొని అన్ని పండుగలకి ఎవరో ఒక దేవుడు ఉంటాడు, ఆకరికి కాముని పౌర్ణమి కి కూదా మన్మదుడు అనే stupid దేవుడున్నాడు కాని ఏదేవుడు లేని ప్రపంచంలొని ఎకైక పండుగ అంటె ఈ నూతన సంవత్సరపు పండుగే, ఆరోజు రాత్రి అన్ని దేవుళ్ళకి అర్దరాత్రి సెలవంట మరి ఏ దేవుడ్ని కొరుకుంటావు వసూ.
అయినా మన పిచ్చిగాని మనకష్టం దేవుడుకేం తెలుస్తుంది చెప్పు? అందుకే నేనోక నిర్ణయానికోచ్చాను, నూతనసంవత్సరపు ఆ నిశబ్దక్షణలలో నా మది కోవెలలొని గర్బపిఠం నుంచి అన్ని దేవుళ్ళు శలవు తేసుకున్నపుడు అక్కడ కేవలం నిన్ను మాత్రమే ప్రతిష్టించుకుంటాను,ఆరోజు మంత్రాలు చదవక్కరలేదు, మట్లాడక్కరలేదు పుష్పం పత్రం సమర్పించక్కరలేదు. నా చిన్ని ఆశలని నైవేద్యంగా పేట్టి కళ్ళతోనే హరతి సమర్పించుకుంటాను, నా ఈ హౄదయం కేవలం నీ ఙ్ణాపకలలో, నీ ఆరాదనలో, నీ నిరిక్షణలో ఈ నూతన సంవత్సరపు అర్దరాత్రి మొత్తం నిండిపోతుంది.
నువ్వు అక్కడ మీఇంటిలో రాత్రి నిద్రరాని జాములో నేను గుర్తుకోచ్చి ఒక వెచ్చని కన్నిటి చుక్క నీ కంటి చివరనుంచి నిశబ్దంగా చెక్కిలి మీదకీ జారినపుడు నీ మనసు మన ఆశల జీవితసౌదం గురించి ఆలొచిస్తూ ఉండిపోతుంది కదూ!
any way wish you happy new year.
your's for ever
mahe.