నీవు లేవు నీ జ్ఞాపకం వుంది



నా జీవితానికి చివరి చైత్రమాసమా.
నీ కంటిపాపలో నా ప్రతిబింబాన్ని ఒకటి దాచుకోరా. ఎప్పుడైనా మన జ్ణాపకాలు కన్నీరుగా మారి చెంపలపై జారి నీ సౌందర్యాన్ని కరిగించకుండా నిలుపుతుంది.
ఇదేలా సాద్యం అవుతుంది పిచ్చి? అక్కడెక్కడో నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఇక్కడ నా పెదవులు ఎందుకు విరబూస్తాయి, నీ వాకిట్లో పున్నమి వెన్నెల వర్షం కురిస్తే ఇక్కడేందుకు నా హృదయసాగరం ఉప్పోంగుతుంది, నీ కళ్ళు తడిబారితే నా కళ్ళెందుకు మసకబారుతాయి రా.తనకేంటిలే కొత్త ఉరు, కొత్తజీవితం, కొత్త కలలు బాగానే ఉందిలే ఆమెకెక్కడ నేను గుర్తురావాలి ఆమె సుఖంలో ఆమె హయిగా ఉంది అని అనుకొని ఇన్ని సంవత్సరాలు గడిపాను.
ఇంకా గుర్తుంచుకుంటాడా ఆరోజే మరచిపోయి ఉంటాడు, ముందే ఒఠ్ఠి బుద్దవతారం జ్ణాపకాలన్ని భద్రంగా దాచుకొనే వాడయితే నన్నెందుకు పోగొట్టుకుంటాడు పాటికి పూర్తిగా మరచిపోయిఉంటాడు మళ్ళీ అమ్మాయిని చూసాడో తనవిషయం ఎందుకులే అనుకొని నువ్వు బ్రతికేస్తున్నావు.
మన మిద్దరం మనల్ని మనమే ఎంత మోసం చేసుకుంటున్నామో కదా బంగారు.
ఇన్ని సంవత్సరాల తర్వతా మనం కలిస్తే ఎం మాట్లాడుకుంటాం రా?
నాకు తెలుసు,నువ్వు చూసిన వెంటనే మాట్లాడవు, నీ కళ్ళు క్షేమ సమాచారాలు అడుగుతాయి, నా కళ్ళలో లక్షదీపోత్సవాలు, నువ్వు అప్పుడే గుడికి వెల్లివచ్చుంటావు నుదుటున కుంకుమ, జడలో పూలు, అరచేతిలో ఉన్న పటికబెల్లం. మనమిద్దరం అందరినుంచి దూరంగా ఇద్దరే సృష్టించుకున్న మౌనంలో నువ్వు మెల్లగా నన్నుచేరినా ఎదమీద నీ తలవాల్చి నిల్చుంటావు...... ఇద్దరి హృదయ స్పందనలలో ఎవ్వరూ ఎప్పుడు వినని గీతం.
వద్దులే వదిలేయి పిచ్చి పాతగాయాన్ని మళ్ళి రేపడం ఎందుకు పోన్ ఎత్తి మాట్లడటానికి కూర్చుంటే మాటలన్నీ మర్చిపోయి ఇంకా? ఇంకా ? అంటూ ఆలోచించే స్థితికి వచ్చేసాము దానికన్న దుస్థితి కావాలా?తెలుసులే బంగారు ! నేను ఊరికే నిన్ను పాత జ్ణాపకాల దారిలో నిలబెట్టనులేరా. నీ భయం ఏంటని నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు.
అయ్యిందేదో అయ్యిందిలే కళ్ళలో ఎందుకు దుఃఖం! మనం ప్రేమించుకుంది నిజం, అదంతే నిజం రోజు దానిని మాత్రమే గౌరవిద్దం దానిని మాత్రమే గుర్తుంచుకుందాం. జన్మకి ఇదిచాలు పిచ్చి ఊరికే ఆశపడటం ఎందుకు? నీ జీవితం హయిగా వుండని చాలు, మనశ్శాంతిగా జీవించు చాలు.
అయితే బంగారు ఎప్పుడైనా నీ పాప కి కథ చెప్పేటప్పుడు మాత్రం కోటలోని రాజకుమారి ఒక సామాన్యుడిని ప్రేమించిన కథ మాత్రం చెప్పకు అలాంటి కథల్లో ఎప్పుడు నేను వుంటాను. కాని రాజకుమారి మాత్రం వేరెవరి కోటలోనో ఉంటుంది. అది నన్ను బాదిస్తుంది.